6 September, 2026 | 3:31 PM

పచ్చకాంగ్రెస్ పెత్తనం పెరుగుతుందని, అచ్చకాంగ్రెస్‌కు భయం

06-09-2026 | 02:09pm
  1. నరసింహస్వామి ఏం చేశారో.. కేసీఆర్ అలా చేస్తారు
  2. హామీలు నెరవేర్చని రేవంత్ రాజీనామా చేయాలి
  3. కొండా సురేఖతో మొదలైన సంక్షోభం
  4. కాంగ్రెస్ ధర్నా డ్రామా

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ టీపీసీసీ(TPCC) ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ ధర్నాపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Former Minister Jagadish Reddy) సెటైర్లు వేశారు. కొండా సురేఖతో కాంగ్రెస్ లో సంక్షోభం మొదలైందని తెలిపారు. తమ పదవులకు ఎక్కడ ఎసరొస్తుందోనని మిగతా మంత్రులకు భయం పట్టుకుందని చమత్కరించారు.

మంత్రులు శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), పొన్నం ప్రభాకర్ కలిసి సీఎం రేవంత్ రెడ్డి మెప్పుపొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎంని ఇంప్రెస్ చేయడానికే ఇందిరా పార్క్(Indira Park) వద్ద ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. పచ్చ కాంగ్రెస్(Green Congress) పెత్తనం పెరుగుతోందని అచ్చకాంగ్రెస్‌కు భయం పట్టుకుందని తెలిపారు. అంతర్గత సంక్షోభం నుంచే బయటపడేందుకే కాంగ్రెస్ ధర్నా డ్రామా చేస్తోందన్నారు. హామీలు నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాజీనామా చేయాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. సమయానికి నరసిహస్వామని ఏం చేశారో.. కేసీఆర్ అలా చేస్తారని జగదీశ్ రెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు