హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణలో జిల్లా సిబ్బంది కృషి అభినందనీయం

23-11-2026 | 08:47pm

జిల్లా సిబ్బంది సమిష్టి కృషికి ప్రశంసలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ 

జగిత్యాల, నవంబర్ 23( విజయ క్రాంతి ): హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ(HIV AIDS Prevention ) కార్యక్రమంలో భాగంగా 95-95-95 లక్ష్యాల సాధనలో జగిత్యాల జిల్లా సాధించిన విజయానికి గుర్తింపుగా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ డైరెక్టర్ ప్రశంసించిన జ్ఞాపికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(Medical and Health Officer) డాక్టర్ జె. సుజాత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాజేందర్, డాక్టర్ నరేంద్ర, కార్యాలయ సిబ్బంది సోమవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ని కలిసి అందజేశారు. ఈ సందర్భంగా 95-95-95 లక్ష్యాల ప్రాధాన్యతను అధికారులు కలెక్టర్ కి వివరించారు.

హెచ్ఐవితో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ హెచ్ఐవి స్థితి గురించి తెలిసి ఉండాలి. హెచ్ఐవి స్థితి తెలిసిన వారిలో 95 శాతం మంది యాంటీ రెట్రోవైరల్ చికిత్స పొందుతూ ఉండాలి. చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందికి వైరల్ లోడ్ నియంత్రణలో ఉండాలి. ఈ మూడు లక్ష్యాలను సాధించడం ద్వారా హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడంతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుంది. ఈ లక్ష్యాల సాధనలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది చేసిన కృషిని కలెక్టర్  అభినందించారు. ఇదే స్ఫూర్తితో హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ, సురక్షిత స్థాయిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. జిల్లా సిబ్బంది సమిష్టి కృషితో సాధించిన ఈ విజయాన్ని కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ సుజాత, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ శ్రీనివాస్, వైద్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు