ఇళ్ల నిర్మాణాల వేగం పెంచండి

22-09-2026 | 01:09pm

ప్రభుత్వ పథకాల్లో అర్హులకు ఇబ్బందులు కలగొద్దు 

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

​ఆమనగల్లు,(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల(Government welfare schemes) అమలులో లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం వేగవంతంగా చేయాలని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి(MLA Kasireddy Narayana Reddy) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల(CM Relief Fund Cheques)తో పాటు ఎల్‌ఓసీ  మంజూరు పత్రాలను ఆయన స్వయంగా అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మంజూరైన సహాయం సకాలంలో చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో హౌసింగ్ పథకాల పురోగతిపై హౌసింగ్ శాఖ అధికారులు, ఇంజనీర్లు, ఎంపీడీవోలతో ఎమ్మెల్యే విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంజూరైన ఇళ్లు, వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు, పెండింగ్ అంశాలపై పూర్తి సమాచారం సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో డీఈలు హరి, సురేష్; ఎంపీడీవోలు సీత, గీత, సుజాత, సులోచన, జయరాం, విజయలక్ష్మి, శంకర్; మున్సిపల్ కమిషనర్లు మహమూద్, రాఘవేందర్ రెడ్డి; హౌసింగ్ ఏఈలు కేదార్‌నాథ్, పల్లవి, శాలిని, చక్రి, పృథ్వీరాజ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు