జనగామ సంధ్య ఆస్పత్రిలో దారుణం

19-09-2026 | 11:36pm

 - మహిళ మృతి, బంధువుల ధర్నా

జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) కేంద్రంలోని సంధ్య ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం నక్కబొక్కల తండాకు చెందిన గుగులోత్ మంజుల అనారోగ్యంతో బాధపడుతూ గతంలో సంధ్య ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ ఫెయిల్ కావడం వల్లనే ఆమె పరిస్థితి విషమించి హైదరాబాద్ స్పార్క్ ఆస్పత్రి(Hyderabad Spark Hospital)లో చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు