పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీగా నియామకం పొందిన గాదెపాక ప్రసాద్
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీగా గాదెపాక ప్రసాద్ నియమితులయ్యారు. జనగామ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేముల మల్లేష్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గాదెపాక ప్రసాద్ మాట్లాడుతూ... తనకు ఈ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వేముల మల్లేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుంచి ఎస్సీ సెల్ ను బలోపేతం చేస్తానని, దళిత వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను(Government welfare schemes) అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి అందేలా చూస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేస్తానన్నారు.