మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
జనగామలో ఏఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ,(విజయక్రాంతి): జనగామ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్(AS Fashion Show Zone Men's Wear Store) ను సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో నూతన వాణిజ్య సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన దుస్తులు, మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టోర్ నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.