ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
తాడ్వాయి,(విజయక్రాంతి): ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాడువాయి ఎంపీడీవో భరత్ కుమార్(Tadwai MPDO Bharat Kumar) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని(Prajavani Program) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులు ఉంటారని తెలిపారు.
ఏ సమస్య ఉన్న ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. భూ సమస్యపై ఒక దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా ఈ ప్రజావాణిలో నాలుగు శాఖల అధికారులు గైరాజలయ్యారు. రెండు శాఖల అధికారులు ఆలస్యంగా 11 గంటలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ శ్వేత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.