అర్ధరాత్రి బుల్డో జర్ల బీభత్సం

12-10-2026 | 05:30am
  1. భూపాలపల్లి శాత్రాజ్‌పల్లిలో కూల్చివేతలు 
  2. 8 జేసీబీలతో 400కు పైగా ఇళ్లు నేలమట్టం
  3. భారీగా పోలీసుల మోహరింపు 
  4. నోటీసులు ఇవ్వలేదని బాధితుల ఆవేదన
  5. పరిహారం కోసం డిమాండ్

భూపాలపల్లి/మల్హర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచర్లలో అర్ధరాత్రి భారీ కూల్చివేతలు కలకలం రేపాయి. మండల కేంద్రంలోని శాత్రా జ్‌పల్లిలో శనివారం అర్ధరాత్రి రెవెన్యూ(Revenue), పోలీసు, సింగరేణి(Singareni branches), అగ్నిమాపక శాఖల(Fire departments) అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివే తలు చేపట్టారు.

సుమారు ఎనిమిది జేసీబీలతో 400 ఇళ్లను నేలమట్టం చేసినట్లు గ్రా మస్తులు తెలిపారు. ఈ చర్యకు సుమారు 200 మందికి పైగా పోలీసులు బందోబస్తుగా ఉన్నట్లు సమాచారం. కూల్చివేతల విషయం తెలుసుకున్న తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి గ్రామస్తులతో కలిసి అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు.

ముందుగా గ్రామసభ నిర్వహించాలని, బా ధితులకు నోటీసులు ఇచ్చిన అనంతరం మాత్రమే చర్యలు చేపట్టాలని కోరారు. పేద లు అప్పులు చేసి లక్షల రూపాయలు వెచ్చిం చి నిర్మించుకున్న ఇళ్లను అర్ధరాత్రి కూల్చివేయడం సరికాదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూల్చివేతలు కొనసాగాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడంతో ఇళ్లలోని సామగ్రిని సైతం బయటకు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కలపను అటవీశాఖ అనుమతులు, రుసుములు చెల్లించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చామని తెలిపారు. ఒక్కసారిగా ఇళ్లను కూల్చివేయడంతో తమ జీవనాధారం, ఆస్తులు కోల్పో యామని కన్నీటి పర్యంతమయ్యారు.

తాడిచర్ల బ్లాక్ కోసమేనా?

తాడిచర్ల బ్లాక్ గని కార్యకలాపాల నేపథ్యంలోనే ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే కూల్చివేతలకు ముం దు బాధితులకు నోటీసులు ఇచ్చారా? పునరావాసం, పరిహారం కల్పించారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి ఇళ్ల కూల్చి వేతలపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయడంతో పాటు తగిన పరిహారం, పునరావాసం కల్పించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు