ఫ్రోబెల్ పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై అవగాహన
గణపురం, అక్టోబర్ 09 (విజయ క్రాంతి): గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలోని ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్‌లో(Froebel Model High School) శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు(Students) వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటపాటలతో సందడి చేశారు. పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ల్యాదల్ల కృష్ణ గౌడ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ప్రకృతి పరిరక్షణ ప్రాధాన్యతను ఈ పండుగ చాటిచెబుతుందని అన్నారు. పాఠశాల కరస్పాండెంట్ పబ్బ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు తమ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించి భావితరాలకు అందించాలని సూచించారు. పాఠశాల డైరెక్టర్లు ల్యాదల్ల యాదగిరి గౌడ్, సుంకరి జగన్ రెడ్డి లు మాట్లాడుతూ పండుగలు ఐకమత్యం, ఆప్యాయత, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.ఈ
కార్యక్రమంలో ఉపాధ్యాయినులు సుష్మ, సరిత, రాధిక, గీత, సుప్రియ, సోనీ, సుమలత, బిందు, వరలక్ష్మి, శ్రావంతి, స్వప్న, శ్వేత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.