అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న

17-09-2026 | 05:07pm

మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాడుగుల పవన్ శర్మ

భూపాలపల్లి,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు(Ganpati Navratri celebrations) పురస్కరించుకొని ఏకదంతా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెంటివాడ గణేష్ మండపం వద్ద గురువారం మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాడుగుల పవన్ శర్మ ఆధ్వర్యంలో మహా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా విఘ్నేశ్వరుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న అని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నప్రసాదాన్ని వృధా చేయకుండా చూడవలసిన బాధ్యత ప్రతి భక్తుడి పై ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు.

మరిన్ని వార్తలు