హీ సేవా పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి
ముకరంపుర,(విజయక్రాంతి): వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు(swachhta hi seva programs) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల పోస్టర్ ను మంత్రి, కలెక్టర్ చిత్రా మిశ్రా(Collector Chitra Mishra), అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డిఓ షర్మిల, డీఆర్డీఓ గీత తదితర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శుభ్రతకు పెద్దపీట వేస్తూ ప్లాస్టిక్ నిర్మూలన, చెత్త చెదారం తొలగింపునకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. పట్టణాలు, గ్రామాలు శుభ్రంగా ఉంటేనే దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందని పేర్కొన్నారు.