కంటెంట్ క్రియేటర్‎‎కు విజయ్..సర్ ప్రైజ్

17-09-2026 | 05:42pm

తమిళనాడు సీఎం విజయ్(CM Vijay) లండన్ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసింగ్ ఈవెంట్‌కు హాజరైన విజయ్.. ‘దర్శిని లండన్ డైరీస్’ పేరుతో కంటెంట్ రూపొందించే ప్రియదర్శిని శక్తివేల్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘మీ వీడియోలు క్రమం తప్పకుండా చూస్తుంటా’ అని ఆమెతో చెప్పడంతో ప్రియదర్శిని ఆనందం వ్యక్తం చేశారు. చెన్నైకి చెందిన ఆమె ఉద్యోగరీత్యా లండన్ వెళ్లి అక్కడి భారతీయ సంస్కృతి, దేవాలయాలు, రెస్టారెంట్లు, తమిళ కుటుంబాల జీవనశైలిపై వీడియోలు చేస్తున్నారు. ఆమెకు యూట్యూబ్‌లో 11 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు