ఖానాపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ విమోచన దినం
17-09-2026 | 05:38pm
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో తెలంగాణ విమోచన దినం(Telangana Liberation Day) ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ మున్సిపాలిటీలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మౌనిక(Municipal Chairperson Mounika) మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు తెలంగాణ విమోచన దినమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భోపారపు సత్యవతి ,బండి పల్లి సింధుజ ప్రకాష్ ,మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ,మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.