హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
17-09-2026 | 09:37am
హైదరాబాద్: కేంద్రం ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్(Vice President CP Radhakrishnan) హైదరాబాద్‌లో పర్యటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పోలీసు అమరవీరుల స్మృతి స్థూపం వద్ద ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. అనంతరం జాతీయజెండా(National Flag) ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) విగ్రహానికి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్రమంత్రులు షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు.