బీఆర్ఎస్‌లోకి ఇప్పలపల్లి ఉప సర్పంచ్

12-09-2026 | 12:15am

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి రూరల్,(విజయక్రాంతి): మొగుళ్ళపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మాజీ అధ్యక్షుడు బల్గురి తిరుపతి రావు అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌ వినోద్ గ్రామ ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy), వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పి ఛైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి సమక్షంలో చేరగా గండ్ర వారికి కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామరక్ష అనే భావన ప్రజలలో బలంగా ఉందని అన్నారు. గతంలో పార్టీకి దూరమైన వారు, ప్రస్తుతం తటస్థంగా ఉన్నవారు తిరిగి బీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు మేలు జరుగుతుందనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతుందని అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తే, ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం దిశగా తీసుకెళ్తోందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.

గండ్ర జ్యోతి మాట్లాడుతూ తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనను, స్థానిక ఎమ్మెల్యే పనితీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతంలో గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ భేదాలు లేకుండా గ్రామాల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పలపల్లి గ్రామ ప్రజలు బీఆర్ఎస్‌లో చేరడం శుభపరిణామమని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు