రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోం: భట్టి

11-09-2026 | 12:47pm

హైదరాబాద్: 2047 లక్ష్యాలను సాధించాలంటే జీఎస్‌డీపీ వృద్ధి భారీగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ప్రతి ఉత్పత్తి రంగానికి విద్యుత్‌తో సంబంధం ఉన్నందున, అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వ్యవస్థను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వం కేంద్రంతో ఉదయ్ ఒప్పందం చేసుకుందని, దానికి విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించడం లేదన్నారు. రైతుల మోటార్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థలో లోపాల సవరణకు వేల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు