హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

11-09-2026 | 11:15am

హైదరాబాద్: కోల్‌కతాకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) బృందం శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో(Srinagar Colony) ఉన్న ఒక మైనింగ్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తోంది. కోల్‌కతాలో సదరు సంస్థపై కేసు నమోదైన నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కతా, జార్ఖండ్‌లలో కూడా ఈడీ (ED) సోదాలు నిర్వహిస్తోంది. ఈ కేసు గురించి మరింత సమాచారం సేకరించేందుకు, సోదాల సమయంలో అధికారులు పత్రాలు, ల్యాప్‌టాప్‌లను పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు