రేవంత్.. ఎందుకు శిఖండి రాజకీయాలు?

11-09-2026 | 01:47pm
  1. మా ఎమ్మెల్యేలను తొక్కేశారు
  2. అసెంబ్లీకి వెళ్తుంటే యుద్ధ వాతావరణం
  3. మహిళా ఎమ్మెల్యేలపట్ల కీచకం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలపట్ల కీచకంగా వ్యవహారించారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Maheshwaram MLA Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు(BRS women MLAs) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వద్ద తకుకు జరిగిన అవమానం చాలా బాధ కలిగించిందని సబితాఇంద్రారెడ్డి వాపోయారు. మహిళా ఎమ్మెల్యేల జట్టు పట్టుకుని లాగుతూ అరాచకం సృష్టించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని అర్థమవుతోందని ధ్వజమెత్తారు. తమను రక్షించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించారని వివరించారు. ఎమ్మెల్యేలను తోసేస్తే కిందపడిపోగా వాళ్లను తొక్కేశారని ఆరోపించారు.

జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) బీపీ పెరిగి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారన్న ఆమె చాలా మంది ఎమ్మెల్యేలకు దెబ్బలు తగిలాయన్నారు. అసెంబ్లీకి(Telangana Assembly) వెళ్తుంటే యుద్ధ వాతావరణం సృష్టించారని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మూడు రోజులుగా అడుగుతుంటే అరణ్య రోదనే అవుతూందన్నారు. తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎవరు ఆదేశాలు ఇస్తే ఆపారనేది అడుగుతుంటే సమాధానం లేదన్నారు. అసెంబ్లీలో తమ వాదనవినడానికి కూడా సిద్ధంగా లేరని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ జరిగిన తొలి రోజు అరెస్టు చేశాక పార్టీ ఆఫీస్ కు తరలించారని సూచించారు.

దాడిపై ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు

మహిళా ఎమ్మెల్యేలపై దాడి(Attack on women MLAs) ఘటనపై డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశామని సబిత తెలిపారు. దాడి ఘటనపై అసెంబ్లీలో ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. స్పీకర్, సీఎం, శాసనసభ వ్యవహారాల మంత్రి స్పందిస్తారని భావించామన్నారు. తెలంగాణ డీజీపీకి(Telangana DGP) ఫిర్యాదు చేసిన ఎవరూ స్పందించలేదని సబిత ఫైర్ అయ్యారు. మహిళా ఎమ్మెల్యేల వద్ద మగ పోలీసులు, పురుష ఎమ్మెల్యేల వద్ద ఆడ పోలీసులను పెట్టారని ఆమె తెలిపారు. ''రేవంత్ ఎందుకు శిఖండి రాజకీయాలు? చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి'' అని ఆమె డిమాండ్ చేశారు. హక్కులకు భంగం జరిగిందని మానవహక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఆమె సూచించారు. మాపైనే దాడులు చేసి మా ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని తెలిపారు. స్పీకర్ విషయంలో అనకపోయినా విచారణ వ్యక్తం చేశారని చెప్పారు.



మరిన్ని వార్తలు