పాఠశాలలో అగ్నిప్రమాదం: 29 మంది సజీవదహనం
కాంగో: తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని(DR Congo school fire) తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న బుకావులో రెండు పాఠశాలలో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాటలో కనీసం 29 మంది పాఠశాల విద్యార్థులు సజీవదహనమయ్యారని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో పెద్దలు కూడా మరణించినట్లు సమాచారం. జనసాంద్రత అధికంగా ఉండే కడుటు కమ్యూన్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలతో బయటపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సోషల్ మీడియా దృశ్యాలలో పిల్లలు ఆసుపత్రి నేలలపై నొప్పితో పడి ఉండటం కనిపిస్తోంది. అగ్నిప్రమాదంలో సుమారు 300 ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయని బాధితులు తెలిపారు. ఘోర ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.