జర్నలిస్టుల డిమాండ్ల దినంగా గాంధీ జయంతి

02-10-2026 | 06:57pm

భూపాలపల్లి, టౌన్ అక్టోబర్ 02 (విజయ క్రాంతి): ఐజేయూ, టీయూడబ్ల్యూజే(IJU, TUWJ) పిలుపు మేరకు గాంధీ జయంతిని జర్నలిస్టుల డిమాండ్ల దినంగా శుక్రవారం పాటించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి సుభాష్‌కాలనీలోని గాంధీ విగ్రహానికి జర్నలిస్టులు(Journalists) పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు.

అనంతరం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రపతికి రాసిన వినతిపత్రాన్ని టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి సమంతుల శ్యామ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు(MLA Gandra Satyanarayana Rao ) అందజేశారు. ఈ సందర్భంగా మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టం, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, నగదు రహిత వైద్యం, కొత్త వేతన మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ

కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యుడు సామల శ్రీనివాస్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్, చిట్యాల ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఐలయ్య, పుల్ల రవీందర్, సుబ్రహ్మణ్యస్వామి, సుధాకర్, రవి, కాట్రేవుల ఐలయ్య, శీలపాక ప్రణీత్‌కుమార్, నేరెళ్ల ఓదెలు, గుర్రం తిరుపతి, కట్కూరి రాజు, జీడి సురేష్, మాసు కుమార్, మైదం మహేష్, మ్యాదరి సునీల్, గొర్రె అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు