కామంచికల్ లో కూలీల ఆటో ప్రమాదం
- ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి.. ఒకరు పరిస్థితి విషమం..
- 12మందికి గాయాలు..
- ఘటనపై మంత్రులు పొంగులేటి, తుమ్మల విచారం
- క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచనలు
ఖమ్మం రూరల్, అక్టోబర్ 02 (విజయక్రాంతి): ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామానికి చెందిన కూలీలు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది.. పత్తి తీసే పనులకు కూలీలు ఆటోలో ప్రయాణిస్తుండగా రఘునాథపాలెం మండలంలోని పంగిడి వద్ద శుక్రవారం రఘునాధపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో లారీ ఆటోను ఢీకొఃమట్టింది. ఈ ప్రమాద ఘటనలో దొంతు సరుపు భారతమ్మ(55) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషయమంగా ఉంది.
అలాగే ఆటోలో ఉన్న12 మంది కూలీలు గాయాల పాలయ్యైయ్యారు. వీరిని స్థానికులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి వైద్యచికిత్స నిమిత్తం 108 వాహనంలో తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మంత్రులు పొంగులేటి, తుమ్మల దిగ్భ్రాంతి..
రఘనాథపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతురాలు కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత వైద్యాధికారులతో ఫోన్లో మాట్లాడి..మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. క్షతగాత్రులు అంత త్వరగా కోలుకోవాలని, వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.