ఘనంగా శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
- ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహణ
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 11 ( విజయక్రాంతి ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కేంద్రంలోని స్థానిక క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియం(Krishnakalani Ambedkar Stadium) ఎదురుగా ఫ్రెండ్స్ యూత్(Friends Youth) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు(Sri Kanaka Durga Ammavari Sharannavaratri Celebrations) ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవాల వ్యవస్థాపకులు కరాటే శ్రీనివాస్(Karate Srinivas) ( మాదాసి ) మాట్లాడుతూ 2010 సంవత్సరం నుండి ఉత్సవాలను ఎంతో ఘనంగా, వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందని అందరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీనివాస్ ఆకాంక్షించారు. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలత్రిపురసుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.