శభాష్ ఏసీపీ మడత రమేష్

11-10-2026 | 10:32pm
  1. రికార్డుల కోసం కాదు.. యువతలో మార్పు కోసం
  2. రామగుండం నుంచి ముత్తారం వరకు సైకిల్‌పై ప్రయాణం..
  3. పోలీస్ అధికారికి అభినందనలు

ముత్తారం, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : పోలీసు అధికారి(Police officer) అంటే విధులకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగితే ప్రజల్లో ఎంతటి స్ఫూర్తిని నింపవచ్చో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్(Godavarikhani ACP Madatha Ramesh) నిరూపించారు. రామగుండం(Ramagundam) నుంచి ముత్తారం వరకు సైకిల్‌పై(Bicycle) ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆదివారం ఉదయం ఆయన సైకిల్‌పై ముత్తారానికి చేరుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

నేటి కాలంలో చిన్న దూరానికే వాహనాలను ఆశ్రయిస్తున్న తరుణంలో, ఒక పోలీసు ఉన్నతాధికారి సైకిల్‌పై ప్రయాణించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణతో పాటు యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించే సందేశంగా ఈ ప్రయాణాన్ని పలువురు అభివర్ణిస్తున్నారు.

రికార్డుల కోసం కాదు.. యువతలో మార్పు కోసం: ఏసీపీ మడత రమేష్ 

రికార్డుల కోసం కాదు.. యువతలో మార్పు కోసం అనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ తెలిపారు.  వైసీపీ సైకిల్ ప్రయాణం అభినందనీయమని స్థానికులు, యువత ప్రశంసిస్తున్నారు. పోలీసు అధికారులు ప్రజలకు రక్షణ కల్పించడమే కాకుండా, తమ ఆచరణ ద్వారా సమాజానికి స్ఫూర్తినివ్వగలరని ఈ ప్రయాణం చాటిచెబుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు