దేవునిపల్లి స్కూల్ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సమ్మేళనం

11-10-2026 | 10:23pm

కామారెడ్డి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్(Kamareddy Municipality) పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో(Devunipalli Zilla Parishad High School) 2001,2002 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను(Alumni Silver Jubilee Celebrations) ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకోవడం ద్వారా ఎంతోమంది  టీచర్స్,డాక్టర్స్, నర్స్, ల్యాబ్ టెక్నికల్, వివిధ రంగాలలో అభివృద్ధి చెందడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యాబోధన నేర్పిన ఉపాధ్యాయులకు  ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో లింగం ,నర్సింలు, రామకృష్ణ, రాజు, మీసాల రవికుమార్, సురేష్, నరేష్, కృష్ణ స్వామి, రవి, రజిత, సరిత, కళావతి, జయంతి ,వరలక్ష్మి ,ప్రమీల పద్మ శ్యామల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు