ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం
మోతె: అక్టోబర్ 11 (విజయ క్రాంతి):- మోతె మండల(Mothe Mandal) కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో(Anganwadi Centre) అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని(International Day of the Girl) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల హక్కుల సంఘం(Girls Rights Association) జిల్లా కోఆర్డినేటర్ లలిత మాట్లాడుతూ..బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రతతో పాటు సమాజంలో ఆడపిల్లలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.
ఆడపిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, బాలికల పట్ల వివక్ష చూపకుండా అబ్బాయిలతో సమానంగా విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. బాలికలకు రక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ దోసపాటి పద్మ, తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య కమిటీ సభ్యులు పూజిత, నందిని, భువనేశ్వరి, అంగన్‌వాడీ ఆయాలు సునీత, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.