టీయూడబ్ల్యూజే నేత తండ్రి కన్నుమూత
11-10-2026 | 10:15pm
గండిపేట, అక్టోబర్ 11 (విజయక్రాంతి): టీయూడబ్ల్యూజే( TUWJ leader) గండిపేట మండల అధ్యక్షుడు వార్త రాము తండ్రి ఆదివారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. రాము కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.