భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

11-10-2026 | 10:29pm

దేవి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న సర్పంచ్లు మాలోతు సక్రు నాయక్,బానోతు అరుణా దేశ్ పాండు నాయక్

మఠంపల్లి అక్టోబర్ 11 (విజయక్రాంతి) : మండలంలోని కొత్త దొనబండ తండా,కాల్వపల్లి తండాలో దేవి నవరాత్రుల(Devi Navaratri) సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం(Sri Anjaneya Swamy Temple) నందు దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో(Devotional) ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సర్పంచులు మాలోతు సక్రు నాయక్, బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ పాల్గొని దుర్గమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.

అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.విగ్రహ దాతగా సర్పంచ్ మాలోతు సక్రు నాయక్ దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దేవి నవరాత్రుల సందర్భంగా ఆలయంలో భక్తి వాతావరణం నెలకొనగా, అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆసక్తి చూపుతున్నారు.

ఈ కార్యక్రమం భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక ఐక్యతను చాటిచెప్పింది.గ్రామాల్లో దేవి నవరాత్రుల వేడుకలు భక్తిశ్రద్ధలతో,మహిళలు బతుకమ్మ ను పూలతో అలంకరించి మధ్యలో ఉంచి ఆట పాటలతో నృత్యం చేస్తూన్నారు.

మరిన్ని వార్తలు