ఫ్రోబెల్ పూర్వ విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు
గణపురం,(విజయక్రాంతి): నారాయణగిరిపల్లి గ్రామానికి చెందిన బండి గట్టు స్వామి,వినోద దంపతుల కుమార్తె, ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్ పూర్వ విద్యార్థి(Froebel Model High School Alumni)ని బండి ప్రియమణి జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల(Jagityala Government Medical College)లో ఎంబీబీఎస్ సీటు(MBBS seat ) సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ల్యాదల్ల, కృష్ణ, గౌడ్ కరస్పాండెంట్ పబ్బ శివశంకర్, గౌడ్ డైరెక్టర్లు ఎస్. జగన్‌రెడ్డి, ల్యాదల్ల యాదగిరి గౌడ్, వెల్తుర్లపల్లి ఉపసర్పంచ్ సలువాది సుప్రియ, ఉపాధ్యాయ బృందం ప్రియమణిని, ఆమె తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రియమణి పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర కృషితో ఈ విజయాన్ని సాధించిందని, ఆమె విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. తన విజయానికి పాఠశాల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, ప్రోత్సాహం ఎంతో దోహదపడ్డాయని ప్రియమణి పేర్కొంది. భవిష్యత్తులో వైద్య రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయాలని పాఠశాల యాజమాన్యం ఆశీర్వదించారు.