Asian Games 2026: సెమీస్‌లోకి భారత్‌ మహిళా జట్టు

18-09-2026 | 01:35pm

నిషిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో(Asian Games-2026) భారత్ మహిళల జట్టు విజయపరంపర కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన ఆసియా క్రీడల మహిళల క్రికెట్ మ్యాచ్‌లో ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శన, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి(Shree Charani) విధ్వంసకర బౌలింగ్, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అనుభవం లేని జపాన్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్‌కు(Semi finals) దూసుకెళ్లింది. చరణి (4/10), షఫాలీ (2/13) కలిసి ఆరు వికెట్లు పడగొట్టి జపాన్‌ను కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేయగా, భారత్ ఆ లక్ష్యాన్ని కేవలం ఐదు ఓవర్లలోనే ఛేదించి సెప్టెంబర్ 20న బంగ్లాదేశ్‌తో తలపడే అవకాశాన్ని దక్కించుకుంది. అత్యల్ప లక్ష్య ఛేదనలో షఫాలీ (40 నాటౌట్, 15 బంతులు), రిచా ఘోష్‌ (12, ఆరు బంతులు)తో కలిసి కీలక పాత్ర పోషించింది.

మరిన్ని వార్తలు