శ్రీలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

18-09-2026 | 02:02pm

రుద్రంగి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ  విప్ వేములవాడ శాసనసభ్యులు అధిశ్రీనివాస్ తన జన్మదినం సందర్బంగా రుద్రంగి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి( Sri Lakshmi Narasimha Swamy)ని దర్శించుకున్నారు.దర్శనం కోసం వచ్చిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas)కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి శాలువా కప్పి  ఆలయానికి ఆహ్వానించారు. అనంతరం ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి, మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య, స్థానిక నాయకులు మాట్లాడుతూ... రుద్రంగి ముద్దుబిడ్డ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుకోవాలని అలాగే మరెన్నో పదవులు చేపట్టి ప్రజా సేవచేయలని కోరుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో,ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఎస్సి సెల్ అధ్యక్షుడు దయ్యాల శ్రీనివాస్,వార్డు మెంబర్లు,శీలం స్వాతి మీనయ్య,గుగ్గిళ్ల వెంకటేష్,పుదరి మహిపాల్,ఎర్రం అరవింద్,లావుడ్యా సతీష్,గంధం మనోజ్,పుట్కపు మహిపాల్, నాయకులు,గడ్డం శ్రీనివాస్,తర్రె లింగం, కొమిరె శంకర్,పల్లి గంగాధర్,గట్ల మీనయ్య, తర్రే మనోహర్,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు