నాంపల్లి కోర్టుకు కేటీఆర్
18-09-2026 | 09:05am
హైదరాబాద్: నాంపల్లి కోర్టులో(Nampally Court) ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో శుక్రవారం నాడు విచారణ జరగనుంది. మాజీ మంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) విచారణకు హాజరుకానున్నారు. జులై 31న కేటీఆర్ తొలిసారి కోర్టులో విచారణ హాజరయ్యారు. ఫార్ములా-ఈ కార్ రేస్(Formula E Car Race Case) నిర్వహణలో రూ. 55 కోట్లు బదిలీలో అక్రమాలు జరిగాయని కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ కార్ రేసింగ్ నిర్వహించారు. కార్ రేసింగ్ లో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.