ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

17-10-2026 | 04:35pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 17 ( విజయక్రాంతి ) : జాతీయ ఆరోగ్య మిషన్‌(National Health Mission) కింద రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్ హెచ్ ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం(National BC Welfare Association), బీసీ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు శనివారం మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాటికంటి రవికుమార్(Tatikanti Ravikumar), బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి సముద్రాల తిరుపతి మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను(Contract employees) క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పుల(Supreme Court judgments) ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారగోని ఎల్ల స్వామి గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు