టాస్క్ ఫోర్స్ దాడులు
అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం
ఒకరి అరెస్ట్
కరీంనగర్ క్రైం, అక్టోబర్ 17(విజయక్రాంతి): కరీంనగర్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు(Karimnagar Commissionerate Task Force Police) సైదాపూర్ మండలం సోమారం గ్రామ శివారులో వ్యవసాయ బావి తవ్వకాలు(Excavation of agricultural wells) జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమ పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు సరఫరా రామడుగు మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన వేముల భూమయ్య (45)ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ తనిఖీల్లో 475 జిలెటిన్ స్టిక్స్, సుమారు 3,000 మీటర్ల డిటోనేటింగ్ వైర్, రెండు కంప్రెసర్ ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, కంప్రెసర్ ట్రాక్టర్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సైదాపూర్ పోలీసులకు అప్పగించారు.