ఇల్లెందు ఎంపీడీవో ఆఫీస్‌లో బతుకమ్మ సంబరాలు

17-10-2026 | 05:11pm

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ఇల్లెందు ఎంపీడీవో కార్యాలయంలో(Illendu MPDO Office) బతుకమ్మ సంబరాలను(Bathukamma celebrations) ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను(Telangana culture and traditions) ప్రతిబింబించే బతుకమ్మ వేడుకల్లో ఎంపీడీవో ధన్‌సింగ్‌తో(MPDO Dhansingh) పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు(Gram Panchayat Secretaries), కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతను గుర్తుచేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి పట్ల ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అందరూ కలిసికట్టుగా జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అనంతరం దసరా పండుగను కూడా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

మరిన్ని వార్తలు