విద్యుత్ షాక్ తో ఒకరి మృతి
24-09-2026 | 08:47pm
గణపురం, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): మండలంలోని గొల్లపల్లి గ్రామానికి(Gollapalli village) చెందిన వేపచెట్టు కొమ్మలు నరుకుతుండగా దాసరి రాజు (40) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్(Electric shock) తగిలి గురువారం మృతి చెందాడు. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం గొల్లపల్లికి చెందిన దాసరి రాజు ఇంటి ముందున్న వేపచెట్టు కొమ్మలు వర్షాలకు రేకుల షెడ్డు వైపు వాలడంతో వాటిని నరికేందుకు చెట్టెక్కాడు. కొమ్మలను నరుకుతుండగా అవి సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.