ప్రజలు ఆయుష్‌ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

23-09-2026 | 05:16pm

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 

భూపాలపల్లి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ప్రజలు ఆయుష్‌ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయుర్వేదం ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం(International Ayurveda Day) సందర్భంగా భూపాలపల్లిలోని ఇంటిగ్రేటెడ్‌ ఆయుష్‌ 50 పడకల ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ధన్వంతరి భగవాన్‌కు పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయుర్వేదం ఆరోగ్యకరమైన జీవన విధానం, సమతుల్య ఆహారం, యోగా, ప్రకృతి ఆధారిత వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రజలు ఆయుష్‌ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని శిబిరంలో 289 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మధుమేహం, రక్తపోటు, కీళ్ల సమస్యలు, చర్మ వ్యాధులు, జలుబు, దగ్గు, అస్తమా తదితర సమస్యలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి సలహాలు అందించారు.

మరిన్ని వార్తలు