స్కూళ్లకు సెలవు

23-09-2026 | 07:26am

అమరావతి: బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రతరం అయింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దృష్ట్యా అధికారులు అలర్ట్ జారీ(Alert issued) చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు(Schools Holiday  ) ప్రకటించారు. విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లకు సెలవిచ్చారు. అటు  కళింగపట్నానికి 140 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, నేడు విశాఖ-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

తీవ్ర వాయుగుండం కళింగపట్నం(Kalingapatnam) దగ్గర తీరం దాటనున్న నేపథ్యంలో తీరం వెంబడి గంటకు 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అన్ని ప్రధాన ఓడరేవులోలో 3వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. నేడు ,రేపు ఏపీలోని 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది.

మరిన్ని వార్తలు