సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామం(Dharmareddy Village)లో గ్రామ సర్పంచి గులపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్వచ్ఛతహీ సేవ పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని మురికి కాల్వలను పరిశుభ్రం చేసి, పిచ్చి మొక్కలను తొలగించి, గడ్డి మందు పిచికారి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... వర్షాకాలం సందర్భంగా పరిసర ప్రాంతాలలో ఈగలు దోమలు చేరి అనారోగ్యానికి గురి చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వర్షాకాలంలో ఈగలు దోమల వల్ల ఎక్కువగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కావున గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
గ్రామపంచాయతీ తరఫున గ్రామంలో పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంద తెలిపారు.గ్రామస్తులు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ, ఉపసర్పంచ్ జయరాజ్, పంచాయతీ కార్యదర్శి రమేష్, పాలకవర్గ సభ్యులు సాయిబాబా, సిద్దవ్వ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.