యాదగిరిగుట్టను జయప్రదం చేయాలి
గణపురం, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(Telangana Activists' Forum) 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న చేపట్టనున్న చలో యాదగిరిగుట్ట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీయూఎఫ్ గణపురం మండల అధ్యక్షుడు గుజ్జ గంగాధరరావు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీమ శ్రీనివాస్ నాయకత్వంలో నిర్వహించనున్న చలో యాదగిరిగుట్ట కార్యక్రమానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ సమాయత్తమై పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ
కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహబూబ్ పాషా, ఉపాధ్యక్షులు రేపాక రాజేందర్, ఆకుల తిరుపతి, చేగొండ సంపత్, అల్లూరి శ్రీనివాస్, దొగ్గేల దేవేందర్, కాశిరెడ్డి వెంకన్న, దూడపాక నర్సయ్య, కొడారి బిక్షపతి, నారగాని ఎల్లస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.