హక్కుల కోసం మాదిగ జర్నలిస్టులు ఐక్యం కావాలి
05-09-2026 | 04:24pm
జడ్చర్ల, సెప్టెంబర్ 05: హక్కుల సాధన కోసం మాదిగ జర్నలిస్టులు(Madiga Journalists) ఐక్యంగా ముందుకు సాగాలని టీఎంజెఎఫ్(TMJF) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సురేందర్(Panuganti Surender) పిలుపునిచ్చారు. జడ్చర్ల(Jadcherla)లో టీఎంజెఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ నెల 12న హైదరాబాద్ కోఠిలోని బీసీసీ భవన్‌లో మహాసభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర సహాయ కార్యదర్శి మేతరి దాసు, ఉమ్మడి జిల్లా కన్వీనర్ పుల్లగళ్ల శ్రీధర్ తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మాదిగ జర్నలిస్టులు హాజరు కావాలని కోరారు. మహాసభల నేపథ్యంలో జడ్చర్ల మండల అడహక్ కమిటీ కన్వీనర్‌గా గిద్ద విజయ్ కుమార్, కో-కన్వీనర్లుగా గడ్డమీది మహేష్, కడమంచి చిన్నయ్యను నియమించారు.






