5 September, 2026 | 5:25 PM

సమాజానికి ఉపాధ్యాయుడు చీకటిలో వెలుగు వంటి వారు

05-09-2026 | 04:20pm

చేగుంట సెప్టెంబర్5( విజయక్రాంతి): సమాజంలో ఉపాధ్యాయుడు వెలుగు వంటి వారని వారు విద్యార్థులను, ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు తన వంతు పాత్ర పోషిస్తాడని చేగుంట మండలంలో చందాయిపేట్ సర్పంచ్(Chandayipet Sarpanch) తాలూకా మహేశ్వరీ సాయిబాబా(Maheshwari Saibaba) అన్నారు . శనివారం పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) జయంతిని పురస్కరించుకొని చందాయిపేట్ లోని పీఎం శ్రీ ప్రభుత్వ పాఠశాల లో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఆయన చేసిన గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు.

ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుని పాత్ర,వేల కట్టలేని దని, విద్యార్థులు భవిష్యత్తుకు ఉపాధ్యాయులు,మార్గదర్శకంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్,విట్టల్ రెడ్డి, నర్సిములు, సలీం, బంగారయ్య,కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు