తప్పుడు ప్రచారాలు చేస్తే.. ఖబడ్డార్.. నరేష్
తాడ్వాయి,సెప్టెంబర్, 05(విజయ క్రాంతి): ఖబడ్దార్.. నరేష్... సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే తీవ్రంగా స్పందిస్తాం..ఇది గుర్తుపెట్టుకో మొదటిసారి అని వదిలేస్తున్నాం... మరోసారి పునరావృతం అవుతే ఊరుకోం... అంటూ తాడువాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి(Nallavelli Kapil Reddy) తీవ్రంగా హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో ఆయన శనివారం మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శుక్రవారం సోషల్ మీడియాలో తాడువాయి సింగల్ విండో డైరెక్టర్లకు సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి ఒక్కో డైరెక్టర్ కు రూ.4 లక్షలు నగదు ఇస్తాడు.ఈ నగదును అందరూ డైరెక్టర్లు తీసుకోవాలి,ఇవ్వకుంటే న్యాయంగా ప్రశ్నించి తీసుకోవాలి అంటూ మండలంలోని దేవాయిపల్లి గ్రామ సర్పంచ్ నరేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపారు.
ఈ విషయమై తాము తీవ్రంగా స్పందిస్తున్నామని తెలిపారు.తాను సింగిల్ విండో చైర్మన్ ఎన్నికల సమయంలో నన్ను చైర్మన్ గా ఎన్నుకుంటే డైరెక్టర్లకు రూ.4 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నాడన్నారు. హామీ ప్రకారం ముందుగా చెక్కులు ఇచ్చి తర్వాత శ్రీ శబరిమాత ఆశ్రమం వద్దకు డైరెక్టర్లను రప్పించుకొని ఆ చెక్కులను నేను చింపివేసినట్లు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ ఆకిటి ధర్మారెడ్డి, డైరెక్టర్లు అంబీర్ శ్యామ్ రావు, లంబాడి గణేష్, తిప్పారపు మోహన్ రెడ్డి, మరాఠి నరసింహులు, బాపూరావు, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.






