సీతక్క టూర్‌తో గులాబీ నేతల అరెస్టులు
బాన్సువాడ, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం(Banswada Constituency)లో మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను(BRS party leaders), కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. మంత్రి పర్యటన సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అడ్డుకుంటారని సమాచారంతో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.
మంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, ఖలీల్ మోచి గణేష్, బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ,గోడుశెల నరసింహులు గౌడ్, మాజీ సర్పంచ్ ఓడ్ల మహేందర్, టేకుర్ల సాయిలు ఉన్నారు.