సీతక్క టూర్.. బాన్సువాడలో హీట్!
బాన్సువాడ, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మంగళవారం శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేస్తున్న సందర్భంగా పోలీసులు ఏనుగు రవీందర్ రెడ్డి(Enugu Ravinder Reddy) వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా గ్రామాలలో మండల కేంద్రాలలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గం, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం గా కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు చీలిపోయి, ఒకరిపై ఒకరు ఆదిపత్య పోరు కొనసాగిస్తున్నారు. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండా పట్టుకొని బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసిన తమను మంత్రి సీతక్క సభకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా తమని ముం…