డీజే వాహనం సీజ్

25-09-2026 | 01:02pm

నిజాంసాగర్,(విజయక్రాంతి): నిబంధనలు విరుద్ధంగా గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్ సిస్టం వాడడంతో నిజాంసాగర్ పోలీసులు సీజ్ చేశారు. మహమ్మద్ నగర్ మండలం(Mohammed Nagar Mandal) జర్నీ తండా కు చెందిన గణేష్ మండల్ నిర్వాహకులు డీజే ఏర్పాటు చేయడంతో  డీజే సీజ్ చేయడంతో పాటు గణేష్ మండప నిర్వాహకులు, డీజే యజమానిపై కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు