గురుకుల విద్యార్థుల ఎంపిక

25-09-2026 | 01:30pm

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మందమర్రిలోని సెవెన్ ఆప్ హోప్ హైస్కూల్లో నిర్వహించిన ఎస్జిఎఫ్ అండర్- 19 ఫుట్ బాల్ పోటీల(football competitions)లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల(Telangana Social Welfare Gurukul) కాసిపేట విద్యార్థులు ఎం.విగ్నేశ్వర్, జి.కార్తీక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లుగా ప్రిన్సిపల్ వూటూరి సంతోష్ కుమార్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కూడా ఇదే క్రీడాస్ఫూర్తితో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిడి కె. హరిష్ , పీఇటి ఎ. రాజేందర్, విద్యార్థులు ఎంపికైనా క్రీడాకారులను అభినందించారు.

మరిన్ని వార్తలు