వాహనాలు వేలం
ఎక్సైజ్ సీఐ మంగమ్మ
ఎల్లారెడ్డి, అక్టోబర్ 28(విజయ క్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డి లింగంపేట నాగిరెడ్డిపేట గాంధారి మండలాల్లో అక్రమంగా, మద్యం, ఇతరేతర రవాణలో, పట్టుబడిన వాహనాలను వేలం వేయనున్నట్లు ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఎల్లారెడ్డి పరిధిలోని ఎక్సైజ్ సీఐ మంగమ్మ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఆప్కారి శాఖ సిఐ మంగమ్మ, తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పలు మండలాల చెందిన వాహనాలు స్టేషన్ ఆవరణలో వేలం వేయడం జరుగుతుందని ఆసక్తి కలవారు వేలం పాటలో పాల్గొనవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సోమయ్య, ఆప్కారి శాఖ కానిస్టేబుల్ నవీన్, విట్టల్ ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.