పోలీసుల సైక్లింగ్

29-10-2026 | 10:23am

పోలీసు అధికారులతో ఏసీపీ రమేష్ సైక్లింగ్‌

గోదావరిఖని సబ్‌ డివిజన్‌ పరిధిలో పోలీసుల ఆరోగ్యంపై ఏసీపీ ప్రత్యేక దృష్టి

గోదావరిఖని, అక్టోబర్29(విజయక్రాంతి): గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ శాఖ(Godavarikhani Police) అధికారులు, సిబ్బంది ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలనే లక్ష్యంతో గోదావరిఖని సబ్‌ డివిజన్‌ పరిధిలో ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సైక్లింగ్‌ నిర్వహించారు. గురువారం ఉదయం ఏసీపీ రమేష్(Godavarikhani ACP Madatha Ramesh) పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్‌ డివిజన్‌కు చెందిన పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సైక్లింగ్‌ వంటి వ్యాయామాలు దోహదపడతాయి.

రోజువారీ విధుల ఒత్తిడిని అధిగమించేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పోలీస్ ల ఆరోగ్యమే మహాభాగ్యమని ఏసీపీ రమేష్ పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఫిట్‌నెస్‌ ఎంతో ముఖ్యం అనే  సందేశంతో పోలీసు అధికారులు సైక్లింగ్‌లో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో గోదావరిఖని 1-టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, మంథని, రామగిరి, ముత్తారం ఎస్ఐ లు శ్రీనివాస్, సందీప్ కుమార్, రవి కుమార్, గోదావరిఖని ఎస్ఐలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు