రైతులందరికీ రుణమాఫీ చేయాలి..

26-10-2026 | 07:44pm

- వరంగల్ డిక్లరేషన్ మాటలు నిలబెట్టుకోవాలి...

- భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్...

తాడ్వాయి (విజయక్రాంతి): ప్రభుత్వం రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ నాయకులు(Bharatiya Kisan Sangh members) డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి,కామారెడ్డి రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మాట్లాడుతూ... వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని కోరారు.

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.ప్రభుత్వం రుణమాఫీకి 65 లక్షల మంది రైతులు అర్హత కలిగి ఉండగా, కేవలం 25 లక్షల 36వేల మందికి రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. మిగతా 39 లక్షల అరవై నాలుగు వేల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని తెలిపారు. రైతులకు ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నారు,కానీ కేవలం ఎనిమిది గంటల కరెంటు మాత్రమే వస్తుందని అది అంతరాయంతో కూడిన కరెంటు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులు పండించిన ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన ఆ హామీని అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.కేవలం కొన్ని రకాల పంటలకు మాత్రమే మద్దతు ధర ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. రైతు బీమా,పంటల బీమాను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహాసీల్ధార్ శ్వేతకు వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షులు ఏనుగు ప్రభాకర్ రెడ్డి, నాయకులు దేవి రెడ్డి విట్టల్ రెడ్డి, ఏనుగు దామోదర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డీ, నర్సారెడ్డి,సంతోష్ రెడ్డి,సంగారెడ్డి, మల్లేష్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు