వాల్మీకి రచించిన రామాయణం ప్రపంచానికి ఆదర్శం
- బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్
మంచిర్యాల స్పోర్ట్స్,(విజయక్రాంతి): వాల్మీకి(Valmiki) రచించిన రామాయణం ప్రపంచంలోనే ప్రతి వ్యక్తికి ఆదర్శంగా నిలిచిందని, జల్ జమీన్ జంగల్ కోసం పోరాటం చేసిన ఆదివాసి బిడ్డ కొమరం భీమ్ పోరాట స్ఫూర్తి భారత దేశ ప్రజలకు ఆదర్శమని భారతీయ జనతా పార్టీ(BJP) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కొనియాడారు. సోమ వారం భారతీయ జనతా పార్టీ మంచిర్యాల(Mancherial) జిల్లా కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ మోర్చాల ఆధ్వర్యంలో నిర్వహించిన రామాయణ మహా కావ్య రచయిత వాల్మీకి మహర్షి జయంతి, తెలంగాణ ఆదివాసీల పోరాట బిడ్డ కొమరం భీమ్ వర్ధంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బహుజన వర్గాల్లో పుట్టి రామాయణాన్ని రచించి భారతదేశంలో చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి వాల్మీకి మహర్షి అని కొనియాడారు. చాలామంది ఎస్సీ ఎస్టీ గురువులు ఈ యొక్క సమాజాన్ని శాసించారని వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జల్ జంగల్ జమీన్ కోసం పోరాడినటువంటి ఆదివాసి పోరాట యోధులు కొమరం భీమ్ అని, ఆదివాసీలకు పరిపూర్ణ హక్కులు సాధించే వరకు పోరాడినటువంటి వ్యక్తి కొమరం భీమ్ అని, చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడినటువంటి ఆయన పోరాట తెగువ ఆదివాసి బిడ్డలలో ఉందన్నారు.
ఇలాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం చాలా ఆనందదాయకమని, వారి అడుగుజాడలలో ప్రతి ఒక్కరు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్ మాట్లాడుతూ... బోయ కుటుంబంలో జన్మించినటువంటి వాల్మీకి రామాయణం రచించి గొప్ప వ్యక్తిగా కీర్తి గడించారని పేర్కొన్నారు. ఆదివాసి బిడ్డగా కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి ఆదివాసి హక్కుల కోసం నిరంతరం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి నిలిచిన వ్యక్తిగా ఆయనను కొనియాడారు.
చరిత్రలో వీరు ఇరువురు చిరస్థాయిగా నిలిచిపోతారని పోరాటాలకు పుట్టిన గడ్డ ఆదిలాబాద్ జిల్లా అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ఆంజనే యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి రాకేష్ రెన్వా, ఎస్టి మోర్చా అధ్యక్షులు ప్రేమ్ సింగ్, మండల అధ్యక్షులు రాజ్ కుమార్, శ్రీశైలం, ఎస్సీ మోర్చ నాయకులు రాజన్న, వెంకటేష్, పవన్, బీసీ మోర్చా ఉపాధ్యక్షులు హరికృష్ణ, కోటపల్లి మాజీ ఎంపీపీ రామన్న, కాసేటి నాగేశ్వరరావు, కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.